కోదాడ లో వాణి హాస్పిటల్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి వాణి హాస్పిటల్‌లో చిన్నపిల్లల విభాగాన్ని ప్రారంభించారు. వైద్యులు డా. కంభంపాటి వంశీకృష్ణ, డా. నాగరపు ప్రణీత, డా. జాస్తి సుబ్బారావులతో కలిసి ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుపేదలకు తక్కువ ఫీజుతో నాణ్యమైన కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని, సేవాభావంతో పనిచేస్తే ఆస్పత్రికి మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. కోదాడ ప్రజలు చిన్నపిల్లల వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాణి హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, వైస్ చైర్‌పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్