వంటశాల శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండలం ఎస్‌ఎం పేట వద్ద 9.60 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక కేంద్రీకృత వంటశాల శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్థానిక నాయకులతో ఆమె చర్చించారు. వంటశాల నిర్మాణ పనుల పురోగతిని కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕