మోతె: స్థానిక సంస్థల ఎన్నికలను కీలకంగా తీసుకోవాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం మోతె మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్