పందిరి ఫౌండేషన్ సలహాదారు యస్ యస్ రావు. పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జన్మ దినం జరుపుకుంటున్న ఫౌండేషన్ సభ్యులు హైద్రాబాద్ వాసి మిట్టపల్లి వెంకటేశ్వర్లు సహకారంతో మునగాల మండలం ముకుందా పురంలోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సలహాదారు యస్ యస్ రావు మాట్లాడుతూ జన్మ దినాలు ఇలా జరుపుకోవడం అభినందనీయం దాతకు వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.