మునగాల మండలం ఈదుల తండాలో చిన్నారులు సోమవారం వానలు కురవాలని కప్పతల్లి, కప్ప కాముడు ఆటలు ఆడారు. కప్పలను ఒక కాడికి కట్టి, వాటిని వీధుల్లో ఊరేగించారు. గ్రామంలోని ప్రతి ఇంటివారూ కప్పలకు నీళ్లు పోసి అభిషేకం చేశారు. వర్షాలు కురవాలని పంటలు పండాలని వారు కోరుకున్నారు. పాటలు పాడుతూ, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజలు పాతకాలం నుంచి సంప్రదాయంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.