మునగాలలోని యువకుల కోసం జిమ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సామాజిక కార్య కర్త గంధం సైదులు ఆదివారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హైదరాబాదులో కలిసి వినతి పత్రం అందజేసారు. అనంతరం సైదులు మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు త్వరలో జిమ్ సెంటర్ ఏర్పాటుకు తన నిధుల నుంచి మంజూరు చేస్తానని హమీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు కు సైదులు కృతజ్ఞతలు తెలిపారు.