మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో శనివారం చేయూత పింఛన్ దారుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విహెచ్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, తక్షణమే వికలాంగులకు రూ. 2000 పెన్షన్ రూ. 4000, రూ. 4000 పెన్షన్ ను రూ. 6000 కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.