కల్వర్టును ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

కోదాడ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో నూతనంగా నిర్మించిన కల్వర్టును మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో అన్ని వార్డులకు మౌళిక సదుపాయాలు కల్పిస్తామని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. వార్డు సమస్యలను స్థానిక కౌన్సిలర్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కోదాడ మున్సిపాలిటీని జిల్లాలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ రమాదేవి, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్ నాగేశ్వరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్