నడి గూడెం: పంట నష్టానికి ఎకరానికి 40 వేలు ఇవ్వాలీ

తుఫాన్ కారణంగా నష్టపోయిన పత్తి, వరి రైతులకు ఎకరానికి 40,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ గురువారం డిమాండ్ చేశారు. ఏఈఓ ఉపేందర్ తో కలిసి తుఫాను వల్ల నేలమట్టమైన పంట పొలాలను పరిశీలించిన ఆయన, మండల పరిధిలో వందల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు రేఖ, తిరపయ్య, పిచ్చయ్య, గోపాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్