అనంతగిరి మండలం త్రిపురవరం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఏం లక్ష్మీ నారాయణ, గురువారం త్రిపురవరం హైస్కూల్ లో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన ఈ సమావేశంలో, అవగాహన చేసుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు వెంకట్ రమణ, హైమావతి కూడా పాల్గొన్నారు.