రాష్ట్రస్థాయి అండర్-17 వాలీబాల్ పోటీల్లో ఎన్‌ఆర్‌ఎస్ ప్రతిభ

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 వాలీబాల్ పోటీల్లో కోదాడకు చెందిన ఎన్‌ఆర్‌ఎస్ కళాశాల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని తేజశ్రీ ప్రతిభ కనబరిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు ఎంపికవడంతో పాటు బెస్ట్ ప్లేయర్ అవార్డును సాధించింది. ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ జి. వి. , వైస్ ప్రిన్సిపాల్ పి. ఎన్. ఆర్. , అధ్యాపకులు తేజశ్రీని అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕