ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై మోతె సమీపంలో మంగళవారం ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఖమ్మం వైపు వెళుతున్న ట్యాంకర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడగా, డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నంలో కాబిన్ కింద పడి నలిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕