పిఏసిఎస్ చైర్మన్ జక్కులకు ఘన సన్మానం

హుజూర్‌నగర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ ఎన్నికలు జరిగే వరకు పాత చైర్మన్‌లను కొనసాగించాలన్న గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు జక్కుల నరేందర్ మళ్లీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియా, ఇతర వనరులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో సుంకరి శివరాం యాదవ్, జక్కుల మల్లయ్య, శ్రీనివాస్, సీతల రోషపతి, తేజవత్ సైదులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్