నడిగూడెం మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీ కి గురువారం పాలభిషేకం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఇది చారిత్రాత్మక విజయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి మండల అధ్యక్షులు మోష, ప్రకాష్, నవీన్ కుమార్ శ్రీనివాస్ నాగేశ్వరరావు, సుధీర్ , నాగార్జున, సతీష్, ప్రవీణ్ , గురవయ్య, విజయ్ సుమన్, ఉన్నారు.