పండుగకు పల్లె కు కదిలిన జనం... ప్రయాణ ప్రాంగణం లో రద్దీ

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో శనివారం కోదాడ బస్టాండ్ జనసందోహంతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుండి వచ్చే ప్రయాణికులు ఇక్కడ బస్సులు మారుతుండటంతో పాటు, స్థానికంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు భారీగా తరలివచ్చారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ, రద్దీ నియంత్రణ కష్టంగా మారింది. ప్లాట్‌ఫారమ్‌లన్నీ ప్రయాణికులతో నిండిపోవడంతో పండుగ కోలాహలం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్