కోదాడ మండలం దొరకుంట సబ్‌స్టేషన్ పరిధిలో రేపు ఉదయం 9 నుండి 11 గంటల వరకు నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ కోదాడ రూరల్ షేక్ సైదా తెలిపారు. దొరకుంట, నెమలిపురి ఫీడర్లలో చెట్ల కొమ్మలు తొలగించడం, కొత్త లైన్లు వేయడం వంటి పనులు జరుగుతాయి. ఈ కారణంగా రెండు గ్రామాల వ్యవసాయదారులకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.