కోదాడ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో కౌన్సిలర్ కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో నిర్మూలన అందరి బాధ్యత అని, సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.