మునగాల సిఐ రామకృష్ణారెడ్డి రైతులకు సూచనలు జారీ చేశారు. బుధవారం మునగాల మండలం ముకుందాపురంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పశువుల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు వేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతులు తమ పశువులకు, ముఖ్యంగా గేదెలకు రేడియం స్టిక్కర్లు వేయించాలని తెలిపారు. దీనివల్ల రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడకుండా గేదెలను కాపాడుకోవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్, స్థానిక సర్పంచ్ కూడా పాల్గొన్నారు.