పోలీసుల చిత్రహింసలతోనే రాజేష్ మృతి: మాల మహానాడు

సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపణలపై రాజేష్‌ను నాలుగు రోజులపాటు పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లే మరణించాడని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హుస్సేన్ ఆరోపించారు. కోదాడ పట్టణంలో రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, బాధ్యులైన పోలీసులపై 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో ఉన్న రాజేష్‌కు సరైన వైద్యం అందించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని, ఎఫ్ఐఆర్ చేయకుండానే విచారణ చేయడం సరికాదని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటివరకు కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపి, బాధిత కుటుంబానికి ఐదు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల పరిహారం అందించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్