రామచంద్రరావు జన్మదినవేడుకలు ఆయన స్వగ్రామం నల్ల బండ గూడెం లో

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామం కోదాడ మండలం నల్లబండగూడెంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండారు కవితా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు, వికలాంగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కవితా రెడ్డి మాట్లాడుతూ రామచంద్రరావు నిరంతరం ప్రజాసేవలో ముందుండి కార్యకర్తలకు అండగా నిలుస్తున్న నాయకుడని కొనియాడారు. స్వగ్రామంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్