చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన "రైలు పట్టాలు కోసేయండి, ఆస్తులను తగలబెట్టండి" వంటి వ్యాఖ్యలను ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకట నారాయణ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్న కేసీఆర్ ఆస్తులను తగలబెట్టాలని, కానీ తెలంగాణ ప్రజల ఆస్తుల జోలికి వస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఉద్యమ సమయంలో బాల్క సుమన్ ఆంధ్రులను బెదిరించి డబ్బులు పోగు చేశారని ఆయన ఆరోపించారు.