కోదాడ పట్టణం నయా నగర్ లోని రేస్ బాలికల కాలేజీలో సంక్రాంతి సంబరాలు ముందస్తుగా ప్రారంభమయ్యాయి. విద్యార్థినులకు సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కళాశాల చైర్మన్ బాణాల వసంత మాట్లాడుతూ, పల్లె సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరం విద్యార్థులకు తెలియజేసేందుకే ఈ వేడుకలు నిర్వహించామని తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు.