బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్ధిక సహాయం అందజేత

చిలుకూరు మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన కందుకూరి గురవయ్య కుటుంబానికి రామాపురం సర్పంచ్ వేమూరి సతీష్ రూ. 2500 ఆర్థిక సహాయం అందించారు. గురవయ్య భార్య కూడా మరణించడంతో, ఇద్దరు పిల్లలు నిరుపేద కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, నూకపంగు మణికంఠ, మల్లెపంగు చిరంజీవి, కందుకూరి వెంకటేశ్వర్లు, కందుకూరి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్