కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా సాతులూరి హనుమంత రావు నామినేషన్ దాఖలు చేశారు. గత 30 ఏళ్లుగా బీజేపీలో పలు పదవులు నిర్వహించిన హనుమంత రావు, పట్టణ, వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర నాయకులు బండారు కవిత, అక్కిరాజు యశ్వంత్, చిట్టి బాబు, ఎడ్లపల్లి వెంకట్ నర్సయ్య, నెట్టెం వెంకటేశ్వరరావు, కోట కొమ్ముల భాగ్య లక్ష్మీ, దుగ్గి వెంకటేష్, మునగాల నరేష్, లక్ష్మీ, నూనె శశిధర్లు బలపరిచినట్లు తెలిపారు. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి, వార్డు అభివృద్ధికి కృషి చేసే అవకాశం కల్పించాలని కోరారు.