కోదాడ కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతివేడుకలు

కోదాడ కేఆర్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ, భారత దేశంలో అలుముకున్న చీకట్లను తొలగించడానికి విద్య అనే జ్యోతిని వెలిగించిన సంస్కర్త సావిత్రి బాయి పూలే అని అన్నారు. శనివారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రి బాయి పూలే జయంతిలో ఆయన మాట్లాడారు. స్త్రీల చేతుల్లో పుస్తకాన్ని పెట్టి, విద్యను ఆయుధంగా మార్చిన సంఘసంస్కర్త సావిత్రి బాయి అని కొనియాడారు. అనంతరం కళాశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వేముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్