బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి

కోదాడ మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గురువారం కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు రెండు జతల దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నట్లు, కంప్యూటర్ విద్య, వొకేషనల్ విద్య, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే డిజిటల్ బోధన జరుగుతుందని తెలియజేశారు. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్