బ్యాడ్మింటన్ పోటీల ఎంపిక ట్రయల్స్‌ మే 31న

సూర్యాపేట జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్-19, సీనియర్ బ్యాడ్మింటన్ పోటీల ఎంపిక ట్రయల్స్‌ను మే 31న కోదాడలోని ఈఆర్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ. రామారావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయని, జూన్‌లో హైదరాబాద్, మిర్యాలగూడలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల బాలురు, బాలికలు, పురుషులు, మహిళలు తమ ఎంట్రీలు నమోదు చేసుకుని పాల్గొనాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు, టీషర్టులు అందజేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్