పశువుల వైద్యులమని చెప్పి గొర్రె దొంగతనం

కోదాడ మండలంలోని కాపుగల్లు గ్రామంలో తోడేటి వీరబాబు అనే రైతుకు చెందిన గొర్రెను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. రైతు ఉపాధి హామీ పనులకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న చిన్నారులను పశువులకు వైద్యం చేస్తామని చెప్పి నమ్మించి, గొర్రెను తీసుకెళ్లారు. బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్