కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 16వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షేక్ కరీముల్లా బాబా నూతన ఎన్నికల కార్యాలయాన్ని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఈ ప్రాంత ప్రజలు తమ అభ్యర్థులను గెలిపిస్తే, దశాబ్దాలుగా పరిష్కారం కాని 33/11 కేవీ విద్యుత్ వైర్ల సమస్యను పరిష్కరించడంతో పాటు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు.