దున్న పోతు కు ఆరు గంటలపాటు గ్లూకోజ్ చికిత్స

కోదాడ పట్టణంలో విషాహారం తిన్న దున్న ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. యజమాని మేతకు వదిలి వెళ్లగా, రాత్రి ఇంటికి వచ్చాక దున్న నోటి నుంచి నురుగు కారుతూ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పశువైద్యశాలకు తరలించగా, అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య విష ప్రభావంగా నిర్ధారించి అత్యవసర చికిత్స అందించారు. ఆరు గంటల నిరంతర వైద్యం అనంతరం దున్న కోలుకుంది.

సంబంధిత పోస్ట్