కోదాడ మండలం గణపవరం గ్రామంలో జరిగిన బల్గూరి గణేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సోమేశ్ ను హుజూర్నగర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కోదాడ డిఎస్పీ కార్యాలయంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే A2, A3, A4 లను అరెస్టు చేసినట్లు తెలిపారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫోటోల విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలోనే గణేష్ ను హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి సిఐ రామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, మేళ్లచెరువు ఎస్ఐ నవీన్ కుమార్, చింతలపాలెం ఎస్సై పరమేష్ తదితరులు పాల్గొన్నారు.