సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని 15వ వార్డులో సోమవారం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ ఇమామ్ ఏ షఫీ ఆధ్వర్యంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అవసరమైన పత్రాలపై మార్గనిర్దేశం చేశారు.