అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం 190వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాత ఆకుల నారాయణ గుప్త జ్ఞాపకార్థం ఆయన సతీమణి ఉదయలక్ష్మి సహకారంతో ఈ అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు జూకురి అంజయ్య, దేవరశెట్టి హనుమంతరావు, కృష్ణమూర్తి, కోట తిరుపతయ్య, శిరీష, బ్యాటరీ చారి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్