ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం శ్రీ ఆంజనేయ మంత్ర పారాయణం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సామూహికంగా మంత్రోచ్చారణ, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం, అర్చనలు, హారతులు సమర్పించి దేశ, రాష్ట్రాల సుభిక్షం, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్