కోదాడ మండలం కొమరబండ ఉన్నత పాఠశాలలో బద్దం కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ విద్య, క్రీడాభివృద్ధికి ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బద్దం భద్రారెడ్డి మాట్లాడుతూ క్రీడలకు తన సహకారం కొనసాగుతుందన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ దంపతులను ఘనంగా సన్మానించారు.