అనంతగిరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి పునః నియామకం

అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముస్కు శ్రీనివాస్ రెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలం ఏర్పాటు నాటి నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజలకు చేరువై విజయవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు మరోసారి బాధ్యతలు అప్పగించిన మంత్రి, కోదాడ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్