స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ ఆధ్వర్యంలో ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, మండల విద్యాధికారి సలీం షరీఫ్‌కు చిరు సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చీఫ్ అడ్వైజర్ పైడిమర్రి సత్యబాబు, ఆర్యవైశ్య సంఘం కోదాడ ప్రధాన కార్యదర్శి పందిరి సత్యనారాయణ, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణ, ట్రస్ట్ కోఆర్డినేటర్ వంగవీటి రంగారావు, చిట్టిప్రోలు నారాయణ, అన్నం వరప్రసాద్, స్వామి శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెద్దల చేత మొక్కలు నాటించారు. కార్యక్రమానికి హాజరైన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.