ప్రభుత్వ విద్యారంగా బలోపేతం ఉపాధ్యాయులతోనే సాధ్యం.. ఎంఇఓ

కోదాడ ఎంఇఓ సలీం షరీఫ్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. శుక్రవారం కోదాడలో పిఆర్టియూ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మండలంలో పది లోపు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, జీహెచ్ఎం రామారావు, మండల బాధ్యులు అంకులయ్య, రవీందర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్