నడిగూడెం మండల విద్యాధికారి భాజా ఉపేందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని సూచించారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల నమోదును పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మండల బాధ్యులు పాల్గొన్నారు.