అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కోదాడలోని కళాశాలల్లో మండల న్యాయ సేవాధికార సంస్థ అవగాహన సదస్సులు నిర్వహించింది. సీనియర్ సివిల్ జడ్జి సురేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య మాట్లాడుతూ, విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లేదంటే చట్టపరమైన శిక్షలతో పాటు భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.