ఆత్మకూరు ఎస్ మండలం నసీం పేట గ్రామంలో గుండపునేని రవీందర్ రావు ఇంట్లో పుట్టిన ఆడ దూడకు మల, మూత్ర ద్వారాలు, జననావయాలు లేకుండా జన్మించింది. ఈ అరుదైన పరిస్థితిలో దూడ ప్రాణాలను కాపాడేందుకు కోదాడ పశు వైద్యశాల డాక్టర్ పెంటయ్య కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేశారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో దూడ ప్రాణాలతో బయటపడింది.