మైనర్లు వాహనాలు నడపడం ప్రాణాలకే ప్రమాదకరమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో నిర్వహించిన మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లైసెన్స్ లేని మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.