సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై శుక్రవారం రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.