కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థినులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించారు. టాస్క్ నిపుణుడు పి. మనోజ్ సాఫ్ట్ స్కిల్స్ పై అవగాహన కల్పించారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డా. నాగార్జునరావు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.