టీడీపీ వర్చువల్ మహానాడుకు తరలి రావాలి

నల్గొండ పార్లమెంట్ పరిధిలో వర్చువల్‌గా నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని మహానాడు కోఆర్డినేటర్లు ముత్తినేని సైదేశ్వరరావు, ఓరుగంటి ప్రభాకర్ పిలుపునిచ్చారు. కోదాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ, నేడు, రేపు రెండు రోజులపాటు గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ రూపొందించేందుకు మహానాడు వేదిక కానుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్