జమాతే ఇస్లామీ హింద్ లక్ష్యం పేదలకు సేవ చేయడమే

పేదలకు సేవ చేయడానికే జమాతే ఇస్లామీ హింద్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భవించిందని సంస్థ కోదాడ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రహీం తెలిపారు. బుధవారం కోదాడలో బస్టాండు, ఫుట్ పాత్ లపై భిక్షాటన చేస్తున్న బిచ్చగాళ్లకు దుప్పట్లు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. పరోపకారం కన్నా మించిన ధర్మం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు షేక్ ఖాజామీయా, షఫీ సిద్ధిక్, బడుగుల సైదులు, ఖాసీం, షరీఫ్, సత్తార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్