క్షతగాత్రులను కాపాడేందుకు యువకుల సాహసం

మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు వెనుక సీట్లో ఇరుక్కుపోయిన వారిని స్థానిక యువకులు సాహసోపేతంగా రక్షించారు. ప్రమాదంతో కారు డోర్లు లాక్ అవ్వడంతో, గడ్డపారతో వాటిని పగులగొట్టి లోపల ఉన్న ఇద్దరు క్షతగాత్రులను బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ఒక ముస్లిం యువకుడు కూడా ప్రాణాలను లెక్కచేయకుండా సహాయం చేయడం అందరి ప్రశంసలు అందుకుంది.

సంబంధిత పోస్ట్