ఖమ్మం లో జరిగే సీపీఐ ర్యాలీ నీ జయప్రదం చేయాలి

కార్మికుల సంక్షేమం కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందని ఏఐ టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు. శనివారం కోదాడ సీపీఐ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోరాటాల చరిత్ర కలిగిన సీపీఐ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, లతీఫ్, సుధాకర్ రెడ్డి, శ్యామల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్