సమాజానికి చైతన్యం నింపే సాధనమే సాంస్కృతిక కళా మండలి

కోదాడలో తెర సాంస్కృతిక కళా మండలి 33వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ గేయరచయిత చింతల యాదగిరి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసి రోలియో మాట్లాడుతూ కళ ప్రజల కోసం ఉండాలని, సమాజానికి చైతన్యం నింపే సాధనంగా మారాలని అన్నారు. తెర కళా మండలి కృషి ప్రశంసనీయమని కొనియాడారు. మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు కళాకారులకు వేదిక కల్పిస్తూ కళారంగానికి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సినీ నటుడు జెమినీ సురేష్, ఫోక్ సింగర్ శిరీష, గేయరచయిత-దర్శకుడు ప్రకాశ్ నాయుడు, గాయకుడు బిక్షూ నాయక్, జూనియర్ సూపర్ సింగర్ దామిని చింతల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్