పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం... రాయపూడి

కోదాడలోని హుజూర్‌నగర్ రోడ్డులో ఉన్న మాస్టర్ మైండ్ స్కూల్ సమీపంలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, 0-5 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానికులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్